Tuesday , July 16 2024

గంగాపూర్ లో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 25,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గంగాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మర్కుక్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన నీరుడి రాజు (27) ఆదివారం రోజు పొలానికి నీళ్లు పెడదామని ఇంటి నుండి వెళ్ళాడు.మోటార్ వేసిన నీళ్లు రాకపోవడంతో కాలువలోకి దిగి చూశాడు.అదే క్రమం లో విద్యుత్ షాక్ కి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కన ఉన్న రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కొరకై గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.గంగాపూర్ గ్రామంలో రాజు మృతి చెందడంతో గ్రామం లో విషాదఛాయలు నెలకొన్నాయి.మర్కుక్ ఎస్ ఐ మధుకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.