తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 25,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో మర్కుక్ మండల స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు.ఈ టోర్నమెంటు గత వారం రోజుల నుండి కొనసాగుతుంది. ఆదివారం రోజు చేబర్తి,మర్కుక్ జట్లు తలపడగా మర్కుక్ జట్టు విజయం సాధించింది.మ్యాన్ అఫ్ ద మ్యాచ్ ఇవ్వడానికి ముఖ్య అతిధిగా చేబర్తి గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ప్రవీణ్ చారి, శ్రీకాంత్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కప్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల స్పోర్ట్స్ కమిటీ సభ్యులు హరిబాబు,సంతోష్,ప్రవీణ్,శ్రీకాంత్, మల్లేష్,రమేష్,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.