Tuesday , July 16 2024

మర్కుక్ నూతన ఎస్ఐ మధుకర్ రెడ్డి ని కలిసిన చేబర్తి మాజీ సర్పంచ్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 18,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐ గా పదవీ చేపట్టిన సిహెచ్. మధుకర్ రెడ్డి ని ఆదివారం రోజు చేబర్తి మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.వారితో ఎస్సై మాట్లాడుతూ గ్రామాలలో శాంతి భద్రతల గురించి చర్చించి అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.అందరూ భారత రాజ్యాంగ అవగహన కలిగి వుండి, చట్టానికి అందరు కట్టుబడి ఉండాలని,అన్నారు.వారితో పాటు గంగాపూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంపాల శ్రీనివాస్,నరసన్నపేట మాజీ వార్డు సభ్యులు కనకరాజు యాదవ్,చేబర్తి గ్రామ మాజీ వార్డు సభ్యులు అంబికా జయరాం, యువకులు రాంసింగ్,విజయ్ సింగ్, తదితరులు ఉన్నారు.