Saturday , October 12 2024

శ్రీ పురం గోశాల నిర్మాణానికి విరాళం అందజేత

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 18,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలోని శ్రీ పురం లో గోశాల నిర్మాణానికి ఆర్యవైశ్య నాయకులు పురోహితులు శ్రీనివాస్ శర్మ కు ఆదివారం 5,10,116 రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్, ట్రెజరర్ నాగేందర్ మాట్లాడుతూ ముక్కోటి దేవతలు కొలువుండే గోవును ప్రతి ఒక్కరూ పూజించాలని, గోవును పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుందని,ఇక్కడ గోవుల కోసం గోశాల నిర్మాణానికి విరాళం అందజేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేందర్, గాలయ్య, అభిలాష్, చంద్ర మౌళి, కర్ణాకర్, గోశాల చిట్టి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.