Wednesday , September 18 2024

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన మర్కుక్ మండల స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 18,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు చెన్రాజ్ కృష్ణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా శనివారం రోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిర కాల కోరిక స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన కృషి మరువలేనిదని,తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి చేసిన వారి ఆవిరాల కృషి చారిత్రమని, అన్నారు.వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో,ఆనందంగా జీవించాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు.