Sunday , May 26 2024

అయోధ్యకు బయలుదేరిన చేబర్తి బీజేపీ నాయకులు

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 17,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామం నుండి గంధ మల్ల చంద్రం,కొంతo శ్రీను, కొండ బాలకృష్ణ, లు శనివారం రోజు అయోధ్యకు బయలుదేరారు. చేబర్తి గ్రామంలో దుర్గామాతను దర్శించుకొని, అనంతరం గజ్వేల్ లోని ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ర్యాలీగా బయలుదేరి,వెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల చిరకాల కోరిక అయోధ్యలో రామ మందిర నిర్మాణం అని, రామ మందిరానికి సహకరించిన వారికి ధన్యవాదములు అని, దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం పురోగమిస్తుందని,అయోధ్యలో బాలరాముని దర్శించుకునేందుకు గజ్వేల్ నుండి పెద్ద ఎత్తున బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు వెళుతున్న సందర్భంగా అందరికి శ్రీ సీతారాములు ఆశీర్వాదం ఉండాలని అన్నారు.