Monday , June 24 2024

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మే 20:

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో కత్తెరపాక లక్ష్మి ఇటీవల వడదెబ్బకు గురై అనారోగ్యంతో మరణించింది.విషయం తెలుసుకున్న వంటి మామిడి మార్కేట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మి వడదెబ్బకు గురై మరణించడం చాలా బాధాకరమని,బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.వారితో పాటు వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి,చేబర్తి తాజా మాజీ సర్పంచ్ అశోక్ తదితరులు ఉన్నారు.