తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 17,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు , సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు, మేకల కనకయ్య ముదిరాజ్ శనివారం రోజు ఎర్రవల్లిలో గల కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మ్యాకల కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఉక్కు సంకల్పంతో, ఆమరణ నిరాహార దీక్షతో ,చావు నోట్లో తలకాయ పెట్టి, తెలంగాణ రాష్ట్రం సాధించిన కారణజన్ముడు అని అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో,ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.