Wednesday , July 24 2024

బిజెపి బూత్ కార్యకర్తల సమావేశానికి తరలిన బీజేపీ శ్రేణులు

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఏప్రిల్ 11,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రం నుండి బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ బయలుదేరిన బీజేపీ శ్రేణులు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి,సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్య మాట్లాడుతూ మెదక్ పట్టణ కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించే బీజేపీ బూత్ స్థాయి నాయకుల కార్యకర్తల సమావేశం లో పాల్గొనడం కోసం మర్కుక్ మండలం నుండి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్లడం జరుగుతుందని,రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని,భారతదేశంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల బిజెపి మాజీ అద్యక్షులు రమేష్ గుప్తా,సీనియర్ నాయకులు కృష్ణమూర్తి,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ సింగ్, తిరుపతి రెడ్డి,ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్,బీసీ మోర్చ అధ్యక్షులు శ్రీనివాస్,బి జె వై ఏం అధ్యక్షులు మధు,కుంట సత్యం,చంద్రం,ఈశ్వర్,శ్రీనివాస్ వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు,బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు