Monday , September 16 2024

మాజీ ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డిని కలిసిన బబ్బురి రాందాస్ గౌడ్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మార్చ్ 16,

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం రోజు మర్యాద పూర్వకంగా కలిసిన వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్.ఈ సందర్భంగా రాందాస్ గౌడ్ మాట్లాడుతూ మన అందరి ఆత్మీయ నాయకుడు ప్రతాప్ రెడ్డి పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చన,అభిషేకం నిర్వహించి,రాబోయే ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించాలని,ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు.ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించడం జరిగిందని, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం ప్రతాప్ రెడ్డికి శనివారం రోజు ఇవ్వడం జరిగిందని అన్నారు.రాందాస్ గౌడ్ తో పాటు ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.