Wednesday , July 24 2024

నేడు మర్కుక్ రైతు వేదికలో రైతు సోదరులకు వీడియో కాన్ఫరెన్స

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మార్చ్ 11,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం రైతు వేదికలో మంగళవారం రోజు ఉదయం 10 గంటల నుండి 11:30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఉన్నదని మర్కుక్ మండల వ్యవసాయ అధికారి డా.నాగేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతు సోదరులు ప్రస్తుతం వరి మొక్కజొన్న, మామిడి మరియు వివిధ కూరగాయలలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి శాస్త్రవేత్తలను అడిగి నివృత్తి చేసుకోవచ్చని,మండలంలోని పలు గ్రామాల రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.