Monday , September 16 2024

ఎర్రవల్లి లో ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మార్చ్ 11,

మాజీ సీఎం కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో మహాశివరాత్రి పర్వదినాన స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఎర్రవల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కు మొత్తం 38 జట్లు రావడం జరిగింది.ఆదివారం రోజున క్రీడలు ముగిశాయి.అనంతరం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం హాజరయ్యారు.ప్రధమ బహుమతి గజ్వేల్ జట్టు గెలుపొందగా వారికి 10,000 రూపాయలు,ద్వితీయ బహుమతిగా కొమురవెల్లి 5,000 రూపాయలు, తృతీయ బహుమతి గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ 3,000 రూపాయలతో పాటు కప్పులను జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ,గ్రామ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చింతకాయల స్వామి గ్రామతాజా మాజీ సర్పంచ్ భాగ్య బిక్షపతి,మాజీ ప్యాక్స్ వైస్ చైర్మన్ బాల్ రాజు,రోటరీ క్లబ్ అధ్యక్షులు పాండు,బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి,మర్కుక్ మండల ముదిరాజ్ సంఘము అధ్యక్షులు కుంట సత్యం, రామ్మోహన్ రెడ్డి,లు కలిసి బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో, వైస్ చైర్మన్,కర్ణాకర్,అవుట్ డోర్ చైర్మన్ కృష్ణ,గజ్వేల్ రాజు యాదవ్, కన్నయాదవ్,కనకయ్య ముదిరాజ్, రాయపోల్ స్వామి,మాజీ ఉప సర్పంచ్ కనకయ్య,రామ్ చంద్ర రెడ్డి,శ్రీశైలం నరని శ్రీధర్,సిహెచ్ కర్ణాకర్ ,స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.