Monday , September 16 2024

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మార్చ్ 03,

విద్యార్థి దశలో మరుపురాని జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరువలేనిదని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు.జగదేవపూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 1998-1999 బ్యాచ్ ఆదివారం రోజున గణేష్ పల్లి గెస్ట్ హౌస్ లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంతో 24 సంవత్సరాల తర్వాత నాటి వారంతా ఒకచోట చేరి కలుసుకున్నారు.ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఒకరికి ఒకరు ఆత్మీయంగా పలకరించుకొని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ వారి క్షేమ సంగతులు పంచుకున్నారు. ఆటపాటలు డ్యాన్స్లతో సందడి చేశారు.ఇలాంటి స్నేహబంధం కలకాలం కొనసాగిద్దామని మాట్లాడుకున్నారు. ఇకనుంచి అందరం టచ్ లో ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో పాటు మధుర జ్ఞాపకాలను తమ సెల్ ఫోన్లు బంధించుకున్నారు.విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరువలేనివని,విద్యాబుద్ధులు నేర్పిన గురువులు పాఠశాల ఉపాధ్యాయులు మధుసూదన్ రావు,వెంకటేశం, తదితరులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు.నాటి ఉపాధ్యాయులను శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం మెమంటో ను అందించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో అశోక్,శ్రీనివాస్,నవీన్,సత్యం,రాములు, ఈశ్వర్,మాణిక్యం,సురేష్,రవీందర్ రెడ్డి, నర్సింలు,రమేష్,ఆంజనేయులు,బిక్షపతి,సురేష్,ఆంజనేయులు,వైపాల్ రెడ్డి, కుమార్,రాఘవేందర్,రాజు,దేశమంత రెడ్డి,కనకయ్య,సంజీవయ్య,హరి శంకర్ రెడ్డి,రాజయ్య,పర్వతం,మల్లేష్, శ్రీనివాస్,రవి,కొండల్ రెడ్డి,కర్ణాకర్ రెడ్డి, భాగ్య లక్ష్మి,ఉమారాణి,గాయత్రీ, మయూరి,కరుణ,మేరి,అర్చన, సునీత,మౌనిక,కవిత తదితరులు ఉన్నారు.