Wednesday , September 18 2024

మర్కుక్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మార్చ్ 03,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం లో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజు గంగాపూర్, మర్కుక్ జట్లు తలబడగా గంగాపూర్ జట్టు విజయం సాధించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పాండు గౌడ్,జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,స్థానిక సర్పంచ్ అచ్చం గారి భాస్కర్,మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి గెలుపొందిన జట్టు సభ్యులకు బహుమతులు,నగదు బహుమతిని అందజేశారు.కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కు ఆర్థిక సహకారం అందించినవారు మొదటి బహుమతి బట్టు అంజి రెడ్డి,ద్వితీయ బహుమతి మేకల కనకయ్య ముదిరాజ్.బహుమతి కప్స్ కు జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం స్థానిక సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ లు,టెన్నిస్ బాల్స్ కి స్పాన్సర్ తులసి కరుణాకర్, మాన్ అఫ్ ద మ్యాచ్ బహుమతి స్పాన్సర్ మొబైల్ షాప్ బాలరాజ్,తదితరుల సహకారంతో టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని మండల స్పోర్ట్స్ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో శివారు వెంకటాపూర్ మాజీ సర్పంచ్ మంజుల నర్సింలు,మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ కమిటీ సభ్యులు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.