Wednesday , September 18 2024

పోలియో ని తరిమికొడదాం : ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి

తెలంగాణ కెరటం మార్కుక్ మండల ప్రతినిధి మార్చి 3

గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి.వారు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లవాని మొదలుకొని 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు.పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,పోలియోను మన రాష్ట్రం నుండి మన దేశం నుండి తరిమికొట్టాలని పోలియో అంగవైకల్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6:00 వరకు ప్రతి గ్రామం లో అంగన్వాడి నందు, ప్రతి హాస్పిటల్ నందు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో,బస్టాండ్ లో నందు చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.డాక్టర్ రాహుల్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీరిగిరిపల్లి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు లోపు పిల్లలందరికీ అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు అమృతం లాంటివని,తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరినారు.ఈ సందర్బంగా డాక్టర్ Dy DM &HO Dr.శ్రీనివాసు మాట్లాడుతూ డివిజన్లో 11 PHCలలో జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు 24,527 మంది మొత్తం బూతులు,1081 ట్రాన్సిట్ బూతులు, బస్టాండ్లు 9, మొబైల్ టీవీలు 11, మొత్తం వ్యాక్సినేటర్స్ 724 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు.సోమవారం ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయబడునని మిగిలిన పిల్లలు ఆదివారం వేసుకొని పిల్లలు ఎవరైనా ఉంటే సోమవారం ఇంటింటికి తిరిగే సమయంలో వేసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,జడ్పీటీసీ పంగ మల్లేశం,గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ జాకీయొద్దీన్,లైన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్,గజ్వేల్ డిస్టిక్ హాస్పిటల్స్ సూపరిండెంట్ డాక్టర్ సాయికుమార్,స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రజిని,డాక్టర్ బల్వీర్ సింగ్, డాక్టర్ ప్రణయ్ రాజు, డాక్టర్ శ్రీనివాస్,సి హెచ్ ఓ ఎం డి కాశీం, రూట్ ఆఫీసర్ దేవసాని వాసుదేవ్,ఋతు ప్రమీల,శ్రీలత, రమేష్,NCC.N.SS కార్యకర్తలు పాల్గొన్నారు.