Sunday , May 26 2024

అర్హులైన లబ్ధిదారులు గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోగలరు

విద్యుత్ ఏఈ సుధీర్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మార్చ్ 01,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో విద్యుత్ 200 యూనిట్లు లోపు లబ్ధిదారులకు గృహ జ్యోతి పథకం కింద జీరో బిల్లు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ సుధీర్ మాట్లాడుతూ మండలంలోని గృహ జ్యోతి పథకానికి అర్హులైన అభ్యర్థులు మండల అభివృద్ధి కార్యాలయం మర్కుక్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు ఫోన్ నెంబర్ దరఖాస్తు వెంబడి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాగ్య బిక్షపతి, విద్యుత్ సిబ్బంది ఎఫ్ ఎం నర్సయ్య, నారాయణ, చంద్రం తదితరులు పాల్గొన్నారు.