తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 27,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజు స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా
కలెక్టర్ గా ప్రిన్సి,డీ వో గా రోహిత్, డిప్టీ డీవో గా బాలు, , ఎంఈఓ గా సాయికిరణ్, ప్రధానోపాధ్యాయులుగా శ్రీజ, లు వ్యవహరించారు.ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు శంకర్ రెడ్డి, మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి తమ లక్ష్యాలను ఎంచుకొని చదువుతో పాటు, సమాజాన్ని అధ్యయనం చేసుకుంటూ వెనుకడుగు వేయకుండా లక్షాన్ని సాధించే దిశగా కృషి చేయాలన్నారు.అనంతరం విద్యార్థిని, విద్యార్థులు మాట్లాడుతూ రోజు ఉపాధ్యాయులు ఎంత కష్టపడి మాకు చదువు చెప్తున్నారో మాకు ఈరోజు తెలిసిందని, కష్టపడి చదివి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు నర్సింహారావు, రామాకాతరావు, రవీందర్ రావు,విశ్వేశ్వర్ రావు,మల్లేశం,ఎండి షాబుద్దీన్,ఉపాధ్యాయురాలు ప్రశాంతి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.