తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మార్చ్ 03,
పుట్టిన పాపాయి” 0″నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయిద్దాం అని మర్కుక్ మండల తాజా మాజీ సర్పంచ్ అచ్చoగారి భాస్కర్ అన్నారు.ఆదివారం రోజు మర్కుక్ గ్రామ పంచాయతీ ఆవరణలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్,జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం,స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ ల ఆధ్వర్యంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసుకుంటూ ‘5’ సంవత్సరాల”లోపు ఉన్న పిల్లలందరికీ తమకు దగ్గరలోని పోలియో కేంద్రానికి వెళ్లి పోలియో చుక్కలను వేయించుకో వలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో డా”దీప ఏ ఎన్ ఎం స్వప్న,ఆశావర్కర్లు రాణి,లక్ష్మీ, నర్సింలు,శంకర్,తదితరులు పాల్గొన్నారు.