Sunday , May 26 2024

మార్చ్ 31 వరకు 30 పోలిష్ ఆక్ట్ 1861 అమలు..

తెలంగాణ కెరటం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : మార్చ్ 3

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు మార్చి 31 వరకు, జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఐపీఎస్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 30 పోలీస్ఆక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదు. నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదు. ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను మరియు జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధం. రాళ్ళను జమ చేయుట, ధరించి సంచరించుట వంటివి నిషేధం. లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈ సమయంలో నిషేధము. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన 30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షార్హులు అగుదురని ఎస్పి గారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *