Wednesday , July 24 2024

మరణించిన పోలీసుల కుటుంబాలకు చెక్కులను అందజేసిన జిల్లా ఎస్పీ డా.వినీత్.జి

తెలంగాణ కెరటం భద్రాద్రి జిల్లా ప్రతినిధి 2023 మార్చి శుక్రవారం : 03

ఇల్లందు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ వీరభద్రం గారి కుటుంబానికి 26,00,000/-ల రూపాయల నగదు చెక్కును,అదేవిధంగా పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన శ్యామ్ సన్ కుటుంబానికి చేయూత ఫండ్ 1,00,000/-ల రూపాయల చెక్కును,మణుగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ మరణించిన హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కుటుంబానికి కార్పస్ ఫండ్ 60,000/-ల రూపాయల నగదు చెక్కులను ఎస్పీ డా.వినీత్.జి శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరంతరం విధులలో నిమగ్నమై ఉండే పోలీస్ అధికారులు,సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పోలీస్ శాఖలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ సత్యవతి,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *