తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి మే 7:
నిజామాబాద్ జిల్లా. మోర్తాడ్ మండలం సంతోష్ నగర్ లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా మోర్తాడ్ మండల ఏర్గట్ల మండలం కార్యదర్శి జి. కిషన్ మాట్లాడుతూ 1897 జూలై 4 తేదీన విశాఖపట్నంలో జన్మించిన అల్లూరి. బ్రిటిష్ వారి గుండెల్లో గుణపం అయిండు అని ఆయన అన్నారు. 1922 ఆగస్టు చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి భారీగా ఆయుధాలు సేకరించి. మన్యం ప్రజలను వీరులుగా తీర్చిదిద్ది బ్రిటిష్ వారికి కొనుక్కు లేకుండా చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన అన్నారు.. అల్లూరి లొంగిపోవాలని బ్రిటిష్ వారు మన్యం ప్రజలను చిత్రహింసలు పెడుతుంటే చూడలేక 1924 మే 6రవ తేదీన అల్లూరిని చింత చెట్టుకు కట్టేసి కాల్చి చంపేశారు బ్రిటిష్ వారు. ఆయనను చంపారు కానీ ఆయన ఆశయాన్ని ఆయన ఇచ్చిన విప్లవస్ఫూర్తిని చంపలేరు అని ఆయన అన్నారు..
దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న అధికారం మారింది గాని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. 10 & 20 మంది దోచుకొని ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. ప్రభుత్వాలను నడిపిస్తున్నారు అదాని అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు కృత్రిమ నష్టాన్ని సృష్టించిబ్యాంకు రుణాలు వేలకోట్లు మాఫీ చేస్తున్నారు.కార్మికుడి కర్షకుడి బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదు పది పన్నెండు రోజుల నుంచి. వర్షం పడుతూ ధాన్యం తడుస్తున్న. వడగండ్లు పడి పంట నష్టపోయిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. . కార్మికుడు కర్షకుడు హక్కులు సాధించుకున్న రోజే అల్లూరికి నిజమైన నివాళి అని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా
కమ్మరపల్లి మండల కార్యదర్శి బి.. అశోక్ లక్ష్మణ్. దయాల్ సింగ్ పాల్గొన్నారు