Sunday , May 26 2024

మంటల్లో వరిగడ్డి వామిదగ్ధం

మంటల్లో వరిగడ్డి వామి
దగ్ధం

*నిప్పుగాళ్లతో పొన్నెకల్లు గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

ఆ వ్యక్తులను వెంటనే గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు

అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు

ఖమ్మం రూరల్ ,తెలంగాణ కెరటం జూన్ 17 =మండలం పరిధిలో పొన్నెకల్లు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు గత రెండు రోజుల నుంచి గ్రామంలో ప్రజలను నిప్పుతో భయాందోళనకు గురి చేస్తున్నారు .వివరాల్లోకెళితే శనివారం రైతు వేదిక సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో చుట్టూ ఉన్న పచ్చని చెట్లు మంటల్లో ఖాళీ బూడిదయ్యాయి .అలాగే పక్కనే ఉన్న పెద్ద పొంగు చిన్న వెంకయ్య అనే రైతుది టాక్టర్ లోడు వరిగడ్డి వామి మంటలతో దగ్ధమైంది ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. మంటలు వైకుంఠధామం చుట్టూ వ్యాపించడంతో స్థానికులు గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. రాత్రి వేళలో ఈ మంటలు వ్యాపిస్తే గ్రామంలో పశువులు, వరిగడ్డివాములు ,ఇండ్లు ,ఆస్తి నష్టం ,ప్రాణ నష్టం ,భారీగా సంభవించడం జరుగుతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.