Monday , September 16 2024

అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యం పట్టివేత

తెలంగాణ కెరటం, మార్చి 18, మందమర్రి టౌన్

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని మందమర్రి మండలం చిర్రకుంట గ్రామం వద్ద పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ నగర్ కు చెందిన వారణాసి లక్ష్మణ్ వయసు 23 సంవత్సరాలు, అనే వ్యక్తి గూడ్స్‌ వాహనంలో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేయడంతో 3.5 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టుబడింది. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వారణాసి లక్ష్మణ్ పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారణాసి లక్ష్మణ్ మందమర్రి మండలంలోని చిర్రకుంట, శంకర్పల్లి, మామిడిగట్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజల వద్ద నుంచి ప్రభుత్వ రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు