Saturday , October 12 2024

ఘనంగా మహాత్మ జ్యోతిభాపూలే జయంతి వేడుకలు

తెలంగాణ కెరటం, ఏప్రిల్ 11, మందమర్రి

మహాత్మ జ్యోతిబాపూలే ఆసయాసాధనకు కృషి చేయాలి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందు.

మహాత్మ జ్యోతిబాపూలే జీవితం అందరికీ ఆదర్శం అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందర్ తెలిపారు. గురువారం పట్టణంలోని మార్కెట్ సెంటర్లో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన మానవతావాది మహాత్మ పూలే అని కొనియాడారు .అంతే కాకుండా మహిళల విద్య హక్కు కోసం ఎనలేని కృషి చేసి వారికి విద్యను అందేలా చేసిన మొదటి వ్యక్తి కూడా ఆయనే అని చెప్పారు. సతి సగమనం బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించి వాటిని అరికట్టేందుకు కృషి చేశాడని చెప్పారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం పాటుపడ్డాడని తెలిపారు. అనగార్ల కూలాలపై జరుగుతున్న దాడులు వివక్షకు వ్యతిరేకంగా పోరాడని పేర్కొన్నారు. మరణించేంతవరకు తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వీడకుండా ప్రజల కోసమే పనిచేసిన నిస్వార్థ సేవకుడు పూలే అని తెలిపారు. ఆ మహనీయునికి ప్రభుత్వాలు భారతరత్న అవార్డు అందజేయాలని చెప్పారు. అదేవిధంగా కుల జనగణన కూడా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కుల సంఘాల నాయకులు పోలు శ్రీనివాస్,సత్తుకు సుదర్శన్, గాండ్ల సంజీవ్, నర్సోజి, దేవేందర్ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.