తెలంగాణ కెరటం, ఏప్రిల్ 11, మందమర్రి
మందమర్రి మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లింలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని సిఆర్ క్లబ్, విద్యానగర్ దగ్గర ఉన్న ఈదుగాను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా దయవల్ల నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సో సుదర్శన్, పట్టణ అధ్యక్షులు అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.