Saturday , October 12 2024

మందమర్రిలో ఘనంగా రంజాన్ పండగ వేడుకలు. తెలంగాణ కెరటం.మందమర్రి టౌన్,ఏప్రిల్ 11. నెలరోజుల పాటు కఠిన ఉపవాసదీక్షలు చేసి తదనంతరం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు.నెలవంక కనబడగానే ముస్లిం సోదరులలో ఆనందోత్సవాలు ఒకరినొకరు చాంద్ ముబారక్ చెప్పు కోవడం తదనంతరం రంజాన్ పండుగ రోజు ఉదయాన్నే లేచి కొత్త బట్టలు వేసుకుని కంటికి సుర్మా,అత్తర్ పెట్టుకుని నమాజ్ కొరకు ఈద్గా కు బయలుదేరుతారు.ఈద్గా లొ నమాజ్ పూర్తి చేసుకుని ముస్లిం సోదరులంతా ఒకరినొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై ఇద్గాలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ చెప్పడం విశేషం.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.