Wednesday , July 24 2024

నల్ల నేలలో కళలకు కళాకారులకు కొదవలేదు

దసరా ఫేం మాటల పాటల రచయిత సురేష్

-ఘనంగా క్రోధి నామ ఉగాది ఉత్సవ వేడుకలు

-పలువురికి ఉగాది పురస్కారాలు

-అలరించిన చిన్నారుల నృత్యాలు

తెలంగాణ కెరటం, ఏప్రిల్ 09, మందమర్రి

నల్ల నేలలో కళలకు కళాకారులకు కొదవలేదనీ దసరా ఫేం మాటల పాటల రచయిత సురేష్ అన్నారు. తెలుగు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రోధినామ ఉగాది ఉత్సవ వేడుకలు 2024 కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్ లో నిర్వహించిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు నూతన సంవత్సరంగా ఉగాది పండుగను జరుపుకోవడం ఆనవాయితీ అని ఈసందర్భంగా పలువురిని సత్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. ముందుగా అతిధులచే జ్యోతి ప్రజ్వలన, రంగ స్థల పూజ, పుప్పాల సంహిత నృత్యంతో ప్రారంభించారు. ప్రముఖ జ్యోతిష్యులు డింగిరి కృష్ణ చైతన్య పంచాంగ శ్రవణం సభ్యులకు వినిపించారు. ప్రముఖ రచయితలు అల్లాడి శ్రీనివాస్, గోపగాని రవీందర్, పొనగంటి దక్షిణామూర్తి, పోకల వెంకటేశ్వర్లు, కొండు జనార్దన్ లచే కవితా గోష్టి నిర్వహించారు. శ్రీ సాయి నాట్య కళానిలయం అశ్విని బృందం, నటరాజ నాట్య నిలయం అర్చన బృందం శాస్త్రీయ నృత్యాలు, క్రేజీ విజయ్, క్రేజీ కళ్యాణ్ బృందం జానపద నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న కాంపెల్లి సమ్మయ్య, సలేంద్ర సత్యనారాయణ, పోనగంటి దక్షిణా మూర్తి, అజ్మీరా పురుషోత్తం నాయక్, ఎం.డి ఇబ్రహీం, కొమ్మెర విశ్వేశ్వర శర్మ, ఐత పద్మజ, రేణుకుంట్ల కవితా అజయ్, తుల శివ కీర్తి, నెరువట్ల రాజలింగు,గడ్డం రమేష్ లకు ఉగాది పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో నంది ప్రతిభ పురస్కార గ్రహీత బండ శాంకరీ, తెలంగాణ ధూమ్ ధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్, ఉప్పులేటి గోపిక, విత్తనాల శ్రీనివాస్, రోడ్డ మోహన్, ఉప్పులేటి రాజమౌళి, బైరం రాము, దాసరి రాజనర్సు, ఏడుకోల పవన్ కుమార్, కుర్రే శ్రీనివాస్, జావిద్ ఖాన్, చిలుక శేఖర్, ఈదునూరి ప్రేమ్ కుమార్, పసుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.