తెలంగాణ కెరటం, ఏప్రిల్ 09, మందమర్రి
ఉగాదిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమర్రి మునిసిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ప్రాంతంలో మందమర్రి మున్నూరు కాపు మహాసభ సారధ్యంలో ఉగాది పచ్చడి పంపిణీకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిట్టలచ్చన్న పటేల్ పార్వతి రాజిరెడ్డి పటేల్ లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఉగాదిని ఘనంగా నిర్వహించుకుంటున్నమని ఈ సంవత్సర కూడా అంతే ఐక్యతతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించడం జరిగిందని ఇదే స్ఫూర్తితో మన సంఘాన్ని ప్రతి ఒక్క మున్నూరు కాపు కుల బాంధవులు కలిసొచ్చి ఐకమత్యంతో నిలిస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మనకు రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకోవడం సాధ్యపడుతుందని కనుక ఉగాది ఈ క్రోధనామ సంవత్సరంలో కూడా మనందరం కలిసికట్టుగా మన తెలుగు సంవత్సరం సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకోవడం ఆనందదాయకమని బీసీ వర్గాల్లో ఎక్కువ జనసాంద్రత కలిగిన మున్నూరు కాపులు రేషియో ప్రకారంగా రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసెంబ్లీలో కూడా శాసనసభ్యుల సంఖ్యను పెంచాలని ఉద్యోగాల్లోనూ సమపాళ్లలో రిజర్వేషన్ అమలు చేయాలని మున్నూరు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినట్లు తగినంత ఆర్థిక వనరులను కూడా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు మిట్ట లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి పార్వతి రాజిరెడ్డి చేతుల మీదుగా పచ్చడ పంపిణీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పోలు శ్రీనివాస్ నామని ముత్తయ్య గాండ్ల సంజీవ్ మాదాసు కుమారస్వామి సకినాల శంకర్ సారం సతీష్ జయ క్రాంతి బద్రి సతీష్ కడారి శ్రీధర్ దర్శనాల నరసయ్య తుపాకుల శ్రీనివాస్ సంగతి సంతోష్ మిల్కూరి సుధాకర్ బట్టు రాజ్ కుమార్ తోట సురేందర్ బూబత్తుల వాసు తదితరులు పాల్గొన్నారు.