Wednesday , July 24 2024

చల్లటి నీటి కోసం వాటర్ కూలర్ ప్రారంభం

తెలంగాణ కెరటం, ఏప్రిల్ 09, మందమర్రి

వేసవిలో దాహార్తిని తీర్చేందుకు మందమర్రి మార్కెట్ పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ ఆవరణలో ఏర్పాటుచేసిన వాటర్ కూలర్ ను మంగళవారం సీఐ శశిధర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వేసవిలో ఎండ వేడిని తట్టుకునేందుకు బాటసారుల కోసం వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు ఈ చల్లనీ నీరు త్రాగడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. నిర్వాహకులను అభినందించారు.కాగా మార్కెట్ ఏరియాలోని స్వర్గీయ కడలి రామయ్య, తమ్మిశెట్టి సుభాష్, మాది రెడ్డి మాధవరావు, తాడి కొండ డేవిడ్ రాజ్ ల జ్ఞాపకార్థం చల్లని నీరు అందించేందుకు ఈ వాటర్ కూలర్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు కడలి శ్రీనివాస్, తమ్మిశెట్టి విజయ్ , తాడికొండ లూథర్, మాదిరెడ్డి సుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సొత్తుకు సుదర్శన్, మంద తిరుమలరెడ్డి, పోలు శ్రీనివాస్, హఫీజ్ వూర్ రెహమాన్, నర్సోజి, కట్ల శ్రీనివాస్, మనోహర్, కృష్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.