Wednesday , July 24 2024

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

తెలంగాణ కెరటం, మే 05, మందమర్రి

మందమర్రి పట్టణం లోని సి ఆర్ క్లబ్ ఎదురుంగా చలివేంద్రం ప్రారంభించారు.
అనంతరం వ్యవస్థాప అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ
ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ప్రారంభించడం జరిగింది
ప్రతి ఒక్కరు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని
అలాగే మందమర్రి పట్టణ ప్రజలంతా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఎవరు కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది..
అలాగే ఈ ఎండాకాలం పోయేంతవరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నీ కోరాడడం జరిగింది..
ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని కోరుతూ మీకు అత్యంత అవసరం ఉంటే మా సొసైటీ సభ్యులకు సమాచారం ఇస్తే టాబ్లెట్లు కానీ నిత్యవసర వస్తువులు గాని మేమే మీ ఇంటికి తెచ్చి అందిస్తామని కోరడం జరిగిందని
అలాగే మా సొసైటీకి సహకరిస్తున్న దాతలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ అధ్యక్షుడు నదిపాట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, సకినాల శంకర్, ఎండీ జావిద్ పాషా ,సుందర్,సుందర్, తదితరులు పాల్గొన్నారు..