తెలంగాణ కెరటం, మే 04, మందమర్రి
మందమర్రి ఏరియా హెచ్ఎంఎస్ కార్యకర్తల సమావేశంలో జనరల్ సెక్రటరీ రాష్ట్ర హెచ్. ఎం.ఎస్. అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడిగా జక్కినబోయిన శ్రీనివాస్ నియమించడం జరిగిందని ఆయన తెలిపారు.
అలాగే కే.కే.ఓ.సి. పిట్ సెక్రటరీ గా మౌనిక, సిఎస్పీ పిట్ సెక్రటరీ గా చొప్పరి రామస్వామి, నియమించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గెలిచి నాలుగునెలలైనా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ధృవీకరణ పత్రం తీసుకోలేదు. కార్మికుల హక్కులు, సంక్షేమం మరిచి అధికారులతో కుమ్మక్కై ఏ పనీ చేయడంలేదని మండిపడ్డారు.
ముఖ్యంగా ఏరియాకు రెండు గనులను వెంటనే కేటాయించాలని , తద్వారా ఎంప్లాయ్ మెంట్ పెరుగుతుందని దానిని కూడా గతంలోలాగ రన్నింగు ద్వారా ఎంప్లాయ్ మెంట్ కల్పించాలని తెలుపారు.
కంపనీ క్వార్టర్లు 60 వేలుంటే, కార్మికులు 40వేలే ఉన్నప్పుడు మిగతా 20వేల క్వార్టర్లు ఎటుపోయాయని , రాజకీయ నాయకులు సిఫారసు చేసిన సింగరేణికి సంబంధంలేని నాయకులకు మంచిమంచి క్వార్టర్లను కేటాయిస్తూ కార్మికులకు రిజెక్టెడ్ క్వార్టర్లు ఇస్తున్నారని , సర్ఫేస్ లలో డిప్టేషన్ దందా ఏంటని సర్ఫేస్ లలో కాళీలుండే సీనియర్ అండర్ గ్రౌండ్ కార్మికులకు కేటాయించాలన్నారు.
సింగరేణిలో రాజకీయ జోక్యం వల్లనే గత గుర్పింపు సంఘం కనుమరుగైందని ఇప్పుడు ఐ.ఎన్.టి.యు.సి. అలాగే రాజకీయ జోక్యం కొనసాగిస్తే వీరికీ అదేశాస్తి జరుగుతుందని రియాజ్ అహ్మద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోనాల శ్రీనివాస్ వెల్దిశ్రీనివాసరెడ్డి , ఎర్ర శ్రీనివాసరెడ్డి , నవీన్ ,ముఖేష్ మరియు శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, అనిల్ రెడ్డి , నామాల శ్రీనివాస్ , ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. గౌస్ తదితరులు పాల్గొన్నారు.