Sunday , May 26 2024

పలువురు నాయకులకు వినతిపత్రం అందజేసిన ఆటో యూనియన్ నాయకులు. తెలంగాణ కెరటం. మందమర్రి టౌన్,ఏప్రిల్ 28.కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపా దాస్ గుప్తా మున్షికి,చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేసిన ఆటో యూనియన్ నాయకులు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకుడు మేడి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మహిళలు మా ఆటోలో ఎక్కడమే మానేశారు.తద్వారా మాకు రోజుకు 200 రూపాయల నుంచి 300 రూపాయలు కూడా మిగలడం లేదు.రోజు వారి ఫైనాన్స్,నెలవారీ కిస్తీలు,అప్పులు కట్టలేక మా భార్య పిల్లలను పోషించలేక ఇప్పటివరకు రాష్ట్రంలో 50 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు.మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకం కాదు.కానీ ఆ యొక్క పథకం మాకు గొడ్డలి పెట్టుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు అందుచేత మా యొక్క క్రింది డిమాండ్స్ నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ని కోరుతున్నారు.ముఖ్యంగా పలు డిమాండ్లతో కూడిన మెమోరండాన్ని ఆటో డ్రైవర్లు మందమర్రి ఎమ్మార్వో జిల్లా కలెక్టర్ కి అలాగే కాంగ్రెస్ నాయకులకు వినతి పత్రాలు అందజేశారు.ఆటో డ్రైవర్ల ముఖ్య డిమాండ్లు పదివేల రూపాయలు ఉన్న ఆటో ఇన్సూరెన్స్ ను వెయ్యి రూపాయలకే చేయ్యలి.ప్రత్యేక ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి,కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలి.ఏ కారణం చేతనైనా చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఆటో భీమాను ఏర్పాటు చేయాలి.అర్హులైన వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి బస్టాండు,ప్రతి రైల్వే స్టేషన్,ఇతర చౌరస్తా ఏరియాలో ఆటో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలి.లక్షల మందికి పైగా ఉన్న ఆటో కార్మిక రంగాన్ని అతిపెద్ద పరిశ్రమగా గుర్తించాలి. ప్రజలకు ఎమర్జెన్సీ సేవలు 24/7 అందిస్తున్న ఆటో డ్రైవర్లకు 50 సంవత్సరాలు పైబడగానే 10వేల పెన్షన్ అమలు చేయాలి.ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలని అరికట్టాలి,వడ్డీ స్లాబ్ సిస్టం తొలగించాలి.బ్యాంకుల సిస్టం అమలు చేయాలి,ఫైనాన్స్ పేపర్ల లావాదేవీలు మాతృభాషా అయిన తెలుగులోనే ఉండాలి.ఎలాంటి షూరిటీ లేకుండా 80% సబ్సిడీతో లైసెన్సున్న ప్రతి ఆటో డ్రైవర్ కు బ్యాంకుల ద్వారా ఆటోలు ప్రభుత్వం ఇప్పించాలి.పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.ఆటో డ్రైవర్ కు 12 వేల రూపాయలు సంవత్సరానికి కాదు,ప్రతి నెల 12000వేల రూపాయలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షులు మేడి రాజు, ప్రధాన కార్యదర్శి దాసరి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు దండిగారి శ్రీకాంత్,మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఆటో జేఏసీ మంచిర్యాల ఇన్చార్జి పుట్ట మధుకర్,కార్యదర్శి ఎస్కే గౌస్,గోగు శంకర్,బొల్లు రవి రేకుల కుమార్,రవి దాసరి వినోద్ రాము రాజేశం పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.