తెలంగాణ కెరటం, ఏప్రిల్ 19, మందమర్రి
మందమర్రి పట్టణానికి చెందిన గాదం సుమలత అతి చిన్న వయసులోనే తండ్రి గాదం రామచందర్ తల్లి లక్ష్మి లను కోల్పోయినప్పటికీ తన భర్త ఉదురుకోట సంపత్ ప్రోత్సాహంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని శ్రీ సత్య సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మెడికల్ సైన్సెస్, మధ్యప్రదేశ్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ మోడల్ ఫర్ సైంటిఫిక్ ఆర్టికల్స్ యూజింగ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ లో పరిశోధన పూర్తి చేసి పి హెచ్ డి పట్టా పొందారు. గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ తన విద్య నైపుణ్యాలతో ఎంతోమంది బీటెక్ విద్యార్థులను తీర్చిదిద్దారు. ప్రస్తుతం హైదరాబాదులోని ప్రముఖ సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గాదం సుమలతకు డాక్టరేట్ లభించడం పట్ల తోటి అధ్యాపకులు శుక్రవారం సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సన్మానించారు.