Wednesday , July 24 2024

మండల స్ధాయిలో మెరిసిన నక్షత్ర.

తెలంగాణ కెరటం
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట ప్రతినిధి
మార్చ్ : 5

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుంకి సంధ్య ప్రకాష్ ల కూతురు సుంకి నక్షత్ర మండల స్ధాయిలో మొదటి స్థానంలో నిలిచింది. సత్యసాయిబాబా ట్రస్ట్ వారు మానవ సేవే మాధవసేవ
అనే అంశంపై మండల స్ధాయిలో ఆంగ్ల భాషలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆమెకు సత్యసాయి బాబా ట్రస్ట్ వారు ప్రశంస పత్రం , మెమెంటో అందించారు. మండల స్థాయిలో మొదటి బహుమతి సాధించిన నక్షత్ర ను సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి , ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ , పాఠశాల విద్యాకమిటీ మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు వనం రమేష్ , పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ అఫ్జల్ షహనాజ్ తో పాటు పాఠశాల ఉపాద్యాయ సిబ్బంది నక్షత్ర ను అభినందించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *