Sunday , May 26 2024

మండల వ్యాప్తంగా 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ కెరటం జనవరి 26 సూర్యాపేట జిల్లా ప్రతినిధి

మఠంపల్లి మండల వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి మండలంలోని మండల పరిషత్,ఎంఈఓ పోలీస్ స్టేషన్ ఎమ్మార్వో అగ్రికల్చరల్ ఆఫీస్, సంఘమిత్ర ,పి ఏ సి ఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పలు గ్రామ పంచాయితీ కార్యాలయాలలో అంబేత్కర్,కార్మిక సంఘాల కార్యాలయాలలో మిషన్ భగీరథ తాగునీటి శుద్ధి కేంద్రాలలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఇట్టి వేడుకలు ఉద్దేశించి పలువురు నాయకులు అధికారులు ముందుగా అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన రోజుగా జరుపుకుంతున్నమని. 1950 జనవరి 26న భారత ప్రభుత్వం చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. ఈ సందర్భంగా రెండు వేడుకల మధ్య తేడా స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేయడానికి, గణతంత్ర దినోత్సవం రోజు జండా ఆవిష్కరించడానికి మధ్య తేడా ఉంది. స్వతంత్ర దినోత్సవం రోజున, స్తంభం దిగొన కట్టిన జాతీయ పతాకాన్ని పైకి లాగడం, బ్రిటిష్ వలసవాద పాలన నుండి భారతదేశం స్వతంత్రం పొందడాన్ని సూచిస్తుంది. మొదటి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివాణ పథకాన్ని పైకి ఎగరవేసి బ్రిటిష్ జెండాను కిందికి దించడం బ్రిటిష్ పాలన అంత మొందించడాన్ని, భారత స్వీయ పాలన ఆరంభాన్ని, నవభారత ఆవిర్భావాన్ని సూచిస్తుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పథకాన్ని స్తంభం పై భాగంలో కట్టి పైకి లాగకుండా ,అక్కడే విప్పడం ఇప్పటికే దేశంలో స్వతంత్రంగా ఉండడాన్ని తెలియజేస్తుంది అన్నారు.దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలసవాద పాలన తర్వాత 15 ఆగస్టు 1947న మన దేశానికి స్వతంత్రం సిద్ధించినప్పటికీ 1935లో బ్రిటిష్ పాలనలో రూపొందించిన భారత ప్రభుత్వ చట్టమే అమలులో ఉండేది. కాగా దేశ దేశ స్వతంత్ర అనంతరం రాజ్యాంగ సభ ద్వారా నవంబర్ 26 1949న ఆమోదించబడిన భారత రాజ్యాంగం మాత్రం 26 జనవరి 1950 నుండి అమల్లోకి వచ్చింది. అలా ప్రతి సంవత్సరం 15 ఆగస్టున స్వతంత్ర దినోత్సవం, 26 జనవరిన గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జాతీయ పండుగల జరుపుకుంటున్నామని ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మార్వో మంగ, ఎంపీడీవో జానకి రాములు, ఎంపీ ఓ ఆంజనేయులు, ఆర్ ఐ గిరి ప్రసాద్,ఏపీవో ఉమా, ఏపిఎం సౌజన్య, డాక్టర్ సుధాకర్ ఎంపీటీసీలు నాగిరెడ్డి, ప్రభుదాస్, సైదమ్మ, మాజీ ఎంపీటీసీలు, అధికారులు, సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ వారు, సంఘ బందం అధ్యక్షురాలు బుజ్జి, సీసీలు, వివో ఏలు, ఆఫీస్ సిబ్బంది కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.