తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధిఏప్రిల్ 20:
ప్రిన్సిపాల్ ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి..
ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో తన క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేసిన విషయంలో ఆలస్యంగా వెలుగులులోకి వచ్చింది. కళశాల లో మహిళ దినోత్సవాన్ని మార్చ్ 07 న నిర్వహించారని అందులో కల్వరి చర్చ్ నిర్వహకురాలు క్రిస్టియన్ మత బోధకురాలు ప్రవీణ్ షారోస్ గారిని ని ముఖ్య అతిధిగా పిలిచి క్రైస్తవ పాటలు ,వాక్యాలు చెప్పడం చూస్తే బహిరంగానే తన క్రిస్టియన్ మతాన్ని ప్రిన్సిపాల్ పెంచిపోసిస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీపక్ కుమార్ ఆరోపించారు.
ప్రభుత్వ కార్యక్రమంలో అందులో కళాశాలలో ఇలాంటి మత ప్రచారుకురాలు వచ్చి బైబిల్ వాక్యాలు చెప్పడం ,ప్రిన్సిపాల్ పాటలు క్రైస్తవ పాటలు పాడటం అంటే పూర్తిగా వారి మతాన్ని విద్యార్థులపై రుద్ధే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇతర మతల్లో ఉన్నా వారిని కార్యక్రమంలో పిలవకుండా కేవలం తన మతం వారిని పిలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు..
ప్రిన్సిపాల్ ని వెంటనే సస్పెండ్ చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.