Thursday , May 23 2024

మంథని దేవునిపల్లిలో అక్రమ వెంచర్..??

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం మంతన్ దేని పల్లి గ్రామ శివారులో కొంతమంది దళారులు డబ్బే ప్రధాన ధ్యేయంగా ఉంచుకొని సర్వే నంబర్ 307 మరియు 308 వ్యవసాయం చేసే భూములను వెంచర్ గా మారుస్తున్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసి అమాయక ప్రజల నుండి దాదాపుగా 5 నుచి 10 కోట్ల రూపాయలను అమాయక ప్రజల నుండి వసూలు చేసినట్లు సమాచారం మారుమూల గ్రామంలో ఏమీ తెలియని అమాయక ప్రజలు బిడ్డ పెళ్లి కో కొడుకు చదువు కోసమో దాచుకున్న డబ్బును దళారుల స్వలాభం కోసం ప్రజలకు మాయ మాటలు చెప్పి కాజేచేసినారు అని ప్రజలు వాపోతున్నారు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 20 శాతం భూమిని స్థానిక గ్రామపంచాయతీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి కానీ అలాంటిది జరగలేదు మరియు ఒక లేఅవుట్ వెంచర్ కి ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలు లేకుండా వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది పంచాయితీ అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమంగా ప్లాట్లు గా మార్చి పేద ప్రజలకు అమ్మిన వారిపై పరమైన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు