Wednesday , July 24 2024

జవహర్ నగర్ బస్టాండ్ నిర్మాణం ఏర్పాటు చేయాలి.

— బస్టాండ్ లేక నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు

— షెడ్ల నిర్మాణాలతో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతున్న అక్రమార్కులు

— పూర్తిస్థాయిలో షెడ్ల నిర్మాణాలను తొలగించి బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని ప్రయాణికుల డిమాండ్

— బస్టాండ్ నిర్మాణం విషయంలో మల్లారెడ్డికి నిర్లక్ష్యం ఎందుకు

— నామ మాత్రపు కూల్చివేతల వెనుక ఆంతర్యం ఏమిటి…?

— జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బ్యూరో, మార్చి 18 (తెలంగాణ కెరటం)

బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ప్రయాణికులు వేచి ఉండేందుకు ఇబ్బందికరంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేసిన అక్రమ షెడ్ల నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఈ షెడ్ల నిర్మాణాలను పూర్తిస్థాయిలో తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు, బస్టాండ్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయాలని కుటిలయత్నాలకు పాల్పడుతున్న అక్రమార్కుల కబంధహస్తాల నుండి పరిరక్షించి ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు పాల్పడుతున్న అక్రమార్కులపై చట్టపరమైనవి కఠిన చర్యలు తీసుకొని ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను అభ్యర్థిస్తున్నారు

మేడ్చల్ ప్రతినిధి ( వాయిస్ టుడే ) మార్చి 15 :– ప్రధాన బస్టాండ్ వద్ద గల 434 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ షెడ్ల నిర్మాణాలను తొలగించి బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు, మాజీ మంత్రి మల్లారెడ్డికి జవహర్ నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న తన ఆసుపత్రి భవన నిర్మాణాన్ని దక్కించుకోవడం పై ఉన్న శ్రద్ధ మల్లారెడ్డి మా ఆరాధ్య దైవం అన్నట్లు నమ్మిన ప్రజల సౌకర్యార్థం విశాలమైన బస్టాండ్ నిర్మాణం చేపట్టడంపై ఎందుకు లేదని జవహర్ నగర్ ప్రజలు మండిపడుతున్నారు, జవహర్ నగర్ ప్రజలు నా గుండెకాయ లాంటి వారు జవహార్ నగర్ ప్రజలు నాకు తోడుగా ఉన్నంతవరకు నాకు ఓటమి భయం లేదు అని జబ్బులు గుద్దుకునే మల్లారెడ్డికి తనను నమ్మిన ప్రజల ప్రయాణ సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం చేపట్టాలనే విజ్ఞత లేకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

రెవెన్యూ మున్సిపల్ అధికారులకు నిర్లక్ష్యం ఎందుకు

బస్టాండ్ ప్రాంగణంలో గల 434 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమిలో తాత్కాలిక నిర్మాణాలుగా వెలసిన అక్రమ షెడ్ల నిర్మాణాలను పూర్తిస్థాయిలో తొలగించి ఇట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనపర్చుకోవాల్సిన బాధ్యత అటు రెవెన్యూ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులపై లేదా అనే విమర్శలు స్థానికుల నుండి అనేకమార్లు వినిపిస్తున్నాయి పలు పత్రికల్లో సైతం ఈ ప్రభుత్వ భూమిలో జవహర్ నగర్ ప్రజల ప్రయాణ సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని గత మంత్రి మల్లారెడ్డికి స్థానికులు పత్రిక ప్రకటనల ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంత జరిగినప్పటికీ చట్టానికి సవాల్ విసురుతు అంతా మా ఇష్టం మేమే రాజులం మేమే మంత్రులం అన్న రీతిలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే ఏకైక లక్ష్యంగా దర్జాగా తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి అమాయక ప్రజల వద్ద అక్రమ మార్గంలోలక్షల్లో అద్దెలు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ అక్రమ షెడ్ల నిర్మాణాలను తొలగించకుండా అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబించడం వెనుక ఆంతర్యం ఏమిటీ…? అని స్థానికులు అయోమయానికి గురవుతున్నారు ఎంతో విలువైన ఈ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలనే కుట్రలో భాగంగా ఏర్పాటుచేసిన ఈ అక్రమ షెడ్ల నిర్మాణాలను తొలగించకపోవడంలో దాగి ఉన్న రహస్యం ఏమిటీ…?

అధికారుల తీరు పట్ల అనుమానాలు

లంచాల రూపంలో లక్షలు వెదజల్లైనా కోట్ల విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని చేజిక్కించుకోవాలనే అక్రమార్కుల కుట్రలకు అధికారులు తలోగ్గి విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా…? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అధికారులు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన ఎడల గతంలో తహసిల్దార్ లు దేవుజా గౌతమ్ కుమార్ నాగమణి లతోపాటు ఆర్ఐ స్వర్ణలతారెడ్డి ఈ ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఏర్పాటుచేసిన సూచిక బోర్డులు ఏలా కనుమరుగయ్యాయి అధికారికంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ అధికారుల ఆంక్షలను బేకాథర్ చేస్తు దౌర్జన్యంగా సూచిక బోర్డులను తొలగించి ఏదేచ్ఛగా నిర్మించిన అక్రమ షెడ్ల నిర్మాణాల విషయంలో అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా నామమాత్రపు కూల్చివేతలతో వెనుదిరుగుతు విధి నిర్వహణలో అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనడానికి నిలువెత్తు నిదర్శనం పై కప్పు నేలగూలకుండ కమర్షియల్ షెటర్లు ధ్వంసం కాకుండా ఒక వైపు గోడను తొలగించిన నిర్మాణం నిలువెత్తు నిదర్శనం కాదా నేటి వరకు ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిస్థాయిలో తొలగించే విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు అధికారులు విధి నిర్వహణలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంకా ఏం నిదర్శనాలు కావాలి ఈ అక్రమ షెడ్ల నిర్మాణాలు నిదర్శనాలు కాదా…? అనే నిలదీతలు అధికమవుతున్నాయి ఇప్పటికైనా 434 సర్వే నెంబరు కు చెందిన ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ షెడ్ల నిర్మాణాలను పూర్తిస్థాయిలో తొలగించి ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడుతున్న అక్రమార్కులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకొని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో నివాసితులై ఉన్న మూడు లక్షల మంది ప్రజల ప్రయాణ సౌకర్యార్థం విశాలమైన బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.