Wednesday , July 24 2024

…జూనియర్ అసిస్టెంట్ రమేష్ సస్పెండ్

  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బ్యూరో, మార్చ్ 18 (తెలంగాణ కెరటం)

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కీసర ఎమ్మార్వో ఆఫీస్ లో కల్యాణ లక్ష్మి పథకంలో డబ్బులు అడిగిన విషయం పై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో లేవనెత్తిన అంశంపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కీసర ఆర్డీవో తో ఎంక్వయిరీ చేయించగా ఏ. రమేష్, జూనియర్ అసిస్టెంట్ డబ్బులు డిమాండ్ చేయడం జరిగిందని విచారణలో నిర్ధారణ అయినందున , ఏ.రమేష్, జూనియర్ అసిస్టెంట్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎ.రమేష్ గతంలో కామారెడ్డిలో వీఆర్ఏగా పనిచేశారని వీఆర్ఏ నుండి జూనియర్ అసిస్టెంట్ గా కన్వర్ట్ చేసి కీసర ఎమ్మార్వో కార్యాలయానికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.