Saturday , October 12 2024

మక్తల్ సర్కిల్ పరిధిలో ఉన్న ఇంటర్ పదవ తరగతి పరీక్షలు రాసిన పిల్లల తల్లిదండ్రులకు సీఐ సీతయ్య విజ్ఞప్తి,


తెలంగాణ కెరటం, నారాయణపేట ప్రతినిధి,


మక్తల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేటి ఇంటర్ ఫలితాల్లో రేపటి పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సిఐ సీతయ్య సూచించారు, పిల్లలు ఫెయిల్ అయిన తర్వాత అదేవిధంగా తక్కువ మార్కులు వచ్చాయని పిల్లలు ఎవరిని కూడా తమ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని సిఐ సీతయ్య సూచించారు, అనుకోకుండా పిల్లలు ఫెయిల్ అయినట్లయితే వారికి సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత అయ్యేవిధంగా ప్రోత్సహించాలని వారు విజ్ఞప్తి చేశారు, అదేవిధంగా విద్యార్థులు కూడా నేడు ఓటమి గెలుపులు సహజమని రేపు గెలుపు కొరకు కృషి చేసే విధంగా ప్రయత్నించాలని విద్యార్థినీలకు విద్యార్థులకు సూచించారు,