Saturday , October 12 2024

మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో కండ్ల కలక కలకలం

తెలంగాణ కెరటం వేములవాడ ప్రతినిధి

వేములవాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం వెనుక గల మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు కండ్ల కలక వ్యాపించడంతో కలకలం రేపింది. విద్యార్థులకు పాఠశాలలోనే ఉపాధ్యాయులు చికిత్స చేస్తున్నారు సుమారు 12 మంది విద్యార్థులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపించారు ఈ విషయం మిగతా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను తమ వెంట పంపడానికి ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారని వాపోయారు. ఇట్టి విషయంపై వైస్ ప్రిన్సిపాల్ కుమార్ ను మీడియా ప్రతినిధులు చరవాణిలో సంప్రదించగా విద్యార్థులకు కండ్ల కలక వచ్చిన విషయం నిజమేనని కొంతమంది విద్యార్థులను తమ ఇండ్లకు పంపించామని మిగతా విద్యార్థులకు పాఠశాల హెల్త్ సూపర్వైజర్ మహేష్ చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు