తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో
చట్టం తన పని తాను చేసుకుంటుందా… రాజకీయ పార్టీల దుర్వినియోగానికి గురవుతుందా..?
ప్రతిపక్షాలు పంపిన ఉత్తరంపై ప్రధాని సందేశం ఏమిటి..??
వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ
ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తులను ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని అనుకోవచ్చా..?? ఎందుకు ప్రతిపక్షలపై దర్యాప్తులు జరుగుతున్నాయి..!! మునుపు ఎన్నడు లేని విధంగా… ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి.. అవినీతికి అక్రమాలకు రాజకీయ నాయకులు పాల్పడుతున్నారా..?? లేక రాజకీయ కుట్ర అనుకుంటున్నారా..!! ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు దేనిని నమ్మాలి..!! చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందా.. రాజకీయ జోక్యం ఉంటుందా… ఇలాంటి ప్రశ్నలు అనేకంగా ఎదురవుతున్నాయి.. వీటన్నిటిని సరైన .. సమాధానం చెప్పాల్సింది ఎవరు..?? ప్రధానమంత్రి నరేంద్ర మోడేనా..??? ఎందుకు ప్రధానమంత్రికి ప్రతిపక్ష పార్టీ అధినేతలు లేఖ రాయాల్సి వచ్చింది. నిజాన్ని నిర్భయంగా దర్యాప్తు చేస్తున్న ఈడి ముందుకు పోవడానికి ప్రతిపక్షల గుండెల్లో రైలు పరిగెలుతున్నాయా..?? పార్టీలు తప్పు చేయనప్పుడు ప్రధానమంత్రి కి లేఖ రావాల్సిన అవసరం ఏంటి..? ఈడి ,సి బి ఐ స్వతంత్ర సంస్థలు కదా..!! ఎందుకు ఆ అనుమానాలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా ప్రభుత్వ సొమ్మును కూడగట్టుకుని, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా.., ఎవరు తప్పు చేసినా చట్టం ప్రకారం శిక్ష పడాల్సిందే కదా.. అలాంటప్పుడు. తప్పు చేయని రాజకీయ నాయకులకు.. ఎందుకు అంత భయం పట్టుకుంది. దేశంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు దిగజారుతున్నాయని ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని అపహస్యం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలైన కెసిఆర్ , కేజ్రీవాల్ , మమత బెనర్జీ, సీనియర్ నాయకులు శరద్ పవర్, ఉధవ్ థాకక్రే, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్సు యాదవ్, భగవత్ మాన్, ఫారుక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు అనేది ప్రధానమంత్రి ఆలోచనా..?? అనే కోణంలోనే ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయా..? ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఉపముఖ్యమంత్రి అరెస్టుతో ఇతర పార్టీలలో భయాందోళనలు ఎందుకు కలుగుతున్నాయి. పార్టీల పేరుతో ప్రభుత్వ సొమ్ముని ప్రజాధనాన్ని అక్రమంగా సొమ్ము చేసుకుని వాటిని కాపాడుకునేందుకే రాజకీయ పార్టీల నేతలు ఈ రకమైన విమర్శలు చేస్తున్నారా…! ఎందుకు లిక్కర్ స్కామ్ కేసు ప్రతిపక్షాలను నిద్ర లేకుండా చేస్తుంది నిజంగా వారి పాత్ర ఉందా ..! భారత దేశ ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్వతంత్ర సంస్థలు ఈ.డి ,సి బి ఐ దర్యాప్తు చేస్తుంటే వాటి పైన కూడా బురదజల్లే పరిస్థితి పార్టీలు తీసుకు రావడం కొసమెరుపు.
సుప్రీంకోర్టు, కేంద్ర న్యాయశాఖ మధ్య వివాదం కూడా..!!
కేంద్ర ప్రభుత్వం అన్నిటిలో తలదించుకుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి , కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరిగిన సందర్భాలు తెలిసిందే, వీటన్నిటికీ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఇక ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించొద్దు అనే చూస్తుందని,ఆ కోణంలోనే ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయా…. భారత దేశంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు వేల కోట్లు రూపాయలను బ్యాంకులకు ఎగగొట్టి, ప్రభుత్వ సొమ్మును దోచుకొని విదేశాలకు పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా ఎవరి దగ్గర ఎంత సొమ్ము పోయిందని కూడా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేసి, దానిని రికవరీ చేయకుండా..!? కనీసం శిక్షించలేని పరిస్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాజకీయ నేతల పైన ఎందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే కోణంలో కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనినే ప్రజాస్వామ్యం మీద దాడిగా , నిరంకుశత్వం కొనసాగుతుందని ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగుతూ, ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. దీనిపై ప్రధానమంత్రి స్పందించి భారత దేశ ప్రజలకు ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు, సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజాస్వామ్య దాడేనా లేక ప్రభుత్వం చేస్తున్న దాడా అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రధాని మంత్రిపై ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించాల్సిన హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఎవరు తప్పు చేశారు ఎవరికి శిక్ష పడుతుంది అనేది దేశములోని ప్రతి పౌరుడికి స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు తప్పు చేసినా చట్టం ప్రకారం శిక్ష పడాల్సిందే.. దేశంలో ఎవరో ఒక్కరు తప్పు చేస్తే.. ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఉలికి పడాల్సిన అవసరమేంటి..?? ప్రభుత్వ ,ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ప్రభుత్వ సంస్థల పైన ఉంది. రాజకీయ నేతలపై సిబిఐ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తూ, దేశ సంపదను రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది..?? దేశ సంపదను విదేశాలకు తరలి వెళ్లకుండా..!? చూడాల్సిందే, ప్రత్యేకంగా పని కట్టుకొని ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పోకుండా రాజకీయ కోణంలో ఆలోచించకుండా దేశంలో ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలైన, రాజకీయ నేతలైనా, అధికార పార్టీకి చెందిన నేతలైనా దర్యాప్తు చేసి ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ప్రతిపక్షాలు రాసిన ఉత్తరంపై ప్రధానమంత్రి స్పందించి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రధానమంత్రి పైనే ఉంది. ఈడిని సిబిఐ ని స్వతంత్రంగా దర్యాప్తు చేసే సంస్థల్లగా చూస్తారా.. ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తారా..?? దీనిని ఏ కోణంలో ప్రజలు చూడాలో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.
దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలంటే.. మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే.
దేశ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్న వేల ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అవినీతిలో కురుకపోవడంతో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ రోజులలో మీడియాను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాటికి సంకెళ్లు వేయడం ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందనే చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో మీడియాను కట్టడి చేస్తూ చట్టాలను సవరణ చేస్తూ, పత్రికలను ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రణ చేస్తూ, ప్రభుత్వం చేపడుతున్న వాటిని ప్రచారం చేయాలని నిర్బంధించే విధంగా మీడియాను నియంత్రించడం. దీనినే ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని ప్రజలంతా ఏకమై నిజం నిర్భయంగా రాసే విధంగా పత్రికల వైపు ఎలక్ట్రానిక్ మీడియా వైపు ప్రజలు నిలబడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ పరిపాలన ఏర్పడినప్పుడు పత్రికలే ప్రధాన పాత్ర పోషించి మళ్లీ ప్రభుత్వం ఏర్పడే విధంగా కృషి చేసిన సందర్భాలను గుర్తు చేసుకోవాల్సిందే.
Sustain the exceptional job !! Lovin’ it! Preis von cycrin in Kanada
Especially informative look ahead to visiting again. Migliori offerte su imite generico online
расклад на картах таро бесплатно
без смс имя нигина что означает к чему снится покупать новую куртку напиться молока во сне расчет онлайн нумерологии по
дате рождения