Tuesday , July 16 2024

మద్యం మత్తులో యువకుడు హల్చల్

పోలీసులపై దాడి హోమ్ గార్డ్ కు గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి జూన్:-27

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో నలుగురు హోంగార్డులతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా చందుర్తి మండలం కు చెందిన దండుగల రెడ్డి(38) వట్టల గట్టయ్య (37)లను వాహనం ఆపవలసిందిగా కోరడంతో అతిగా మద్యం సేవించిన ఇరువురు తమ ద్విచక్ర వాహనాన్ని ఆపారనే ఉద్దేశంతో నానా హంగామా సృష్టిస్తూ
విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసి ట్రాఫిక్ వాహనాన్ని ధ్వంసం చేశారు ఎస్ దిలీప్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారిద్దరిని వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు

అనంతరం సిఐ ఓ వెంకటేష్ మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న పోలీస్ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసుల పై దాడి చేయడం తో ఇద్దరు హోంగార్డులు గాయపడినట్టు విచారణ అనంతరము కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపనున్నట్టు తెలియజేశారు