Saturday , October 12 2024

జిల్లా పరిషత్ నిధులతో గట్టు మల్లన్న ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి ఫిబ్రవరి(19)

దూల్మిట్ట మండలంలోని కొండాపూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో ఉన్నటువంటి దైవ క్షేత్రమైన శ్రీ గట్టు మల్లన్న స్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం జిల్లా పరిషత్ నిధులు నుండి మంజూరైనందున నిధులతో ఉమ్మడి కొండాపూర్ స్థానిక ఎంపిటిసి ఇస్లావత్ నముకు సమక్షంలో పనులను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గడిపే వెంకటయ్య ఆలయ కమిటి సభ్యులు ఇస్లావత్ చిరంజీవి, భీమగోని సాగర్ గౌడ్, లింగాల సంపత్,పెరబోయిన గట్టయ్య, అల్లం రాజు, ధారవత్ అనిత,కొయ్యడ కుమారస్వామి మరియు గుడి ప్రధాన అర్చకులు పాల్గొనడం జరిగింది.