Monday , September 16 2024

విఓఏలకు లాక్పత్ దీదీ పైన శిక్షణ.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(6)

మద్దూర్ మండల సమైక్య భవనంలో వివోఏ లందరికీ లాక్పత్ దీదీ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా బ్యాంకు ద్వారా కానీ శ్రీనిధి నుండి గాని వివో ద్వారా రుణాలు తీసుకున్న మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలని ఒక కుటుంబానికి ఒకే ఆదాయం కాకుండా పలు రకాల ఆదాయాలను కల్పించుటకు రుణము తీసుకొని లక్పతదిది కావాలని అనవసరం ఖర్చులు తగ్గించుకొని ఆదాయాన్ని పెంపొందించుకోవాలని జీవనోపాదులను మెరుగుపరచుకోవాలని పాడి గేదెలు గాని అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాల్లో తీసుకున్న రుణముతో లక్షధికారులు కావాలని ఈ పథకం యొక్క ఉద్దేశంతో ఈరోజు వివోఎలకు లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు యొక్క గ్రామాలలో మహిళలందరికీ ఆర్థిక చేకూర్పు మెరుగుపరిచేలా సమావేశాలు నిర్వహించాలని వారి యొక్క రెగ్యులర్ మీటింగ్లో ఈ విషయాలను తెలియజేయాలని శిక్షణ ఇవ్వడం జరిగింది సమైక్య అధ్యక్ష కార్యదర్శులు ట్రెనర్ గా ఏపిఎం విజయనిర్మల ఏపిఎం బాబురావు, టిఎంజి వేణు, సీసీలు, వివోఏలు హాజరు కావడం జరిగింది…