తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(2)
మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామ శివారులో వాగు వద్ద ఇసుక అక్రమ డంపును పట్టుకున్న చేర్యాల సిఐ శ్రీను, మద్దూర్ ఎస్ఐ యూనస్ అహ్మద్ అలీ,ఈరోజు మధ్యాహ్నం సమయమున మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాలపల్లి వాగు వద్ద కొంతమంది వ్యక్తులు కలసి ఇసుక డంపును ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా అమ్మడానికి నిలువచేసి ఉంచినారని నమ్మదగిన సమాచారంపై చేర్యాల సిఐ, మద్దూర్ ఎస్ఐ,వెళ్లి డంపులను గుర్తించి దూల్మిట్ట తహసీల్దారి కు తదుపరి చర్య గురించి అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ చేర్యాల సర్కిల్ పరిధిలోని ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక డంపులు నిలువ చేసి ఉంచిన వారిపై చట్ట ప్రకారము కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియు గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.