తెలంగాణ కేరటం మద్దూరు ప్రతినిధి మార్చి(2)
పల్స్ పోలియో కార్యక్రమములో భాగంగా మద్దూరు,లద్నుర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో శనివారం రోజున జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులతో వైద్యాధికారులు రజిత, సుధీర్, స్టువర్డ్ సన్, సి హెచ్ ఓ శేషగిరిలు పల్స్ పోలియో ర్యాలీ నిర్వహించారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతు పుట్టిన బిడ్డ నుండి 5ఏళ్ళ లోపు వయస్సు పిల్లలందరికీ పోలియో వేయించాలని కోరారు. మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనీ 923 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.పల్స్ పోలియోను తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు,అదికారులు, విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వేజర్,హేమలత, ఫార్మాసిస్టు సందీప్, హెల్త్ అసిస్టెంట్ రఘు, ఆశా కార్యకర్తలు శోభ,ఉపాద్యాయులు పాల్గొన్నారు.