Monday , June 24 2024

మర్మాముల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉత్కం ఆంజనేయులు గౌడ్ ఎన్నిక.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మే 20

మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు,తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తీర్మానించడం జరిగింది. కాంగ్రేస్ పార్టీ గ్రామ స్థాయి కమిటీని రద్దు చేస్తూ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉత్కం ఆంజనేయులు గౌడ్ ను ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శి గా ఒగలబోయిన యాదగిరి గౌడ్ ని గ్రామ యూత్ కాంగ్రెస్ వేచరిని తిరుపతిని ప్రధాన కార్యదర్శి గా గుళ్ళ రవి గ్రామ సోషల్ మీడియా ఇంచార్జిగా కత్తుల భాస్కర్ రెడ్డి ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్ప నిశికాంత్ రెడ్డి,పెద్దఉట్ల కరుణాకర్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్,మాజీ సర్పంచులు వెళ్లి గోపాల్,భిక్షపతి,మాజీ వైస్ ఎంపీపీ పెద్ద ఉట్ల భూపతి రెడ్డి,నూకల సత్తిరెడ్డి,చిగుళ్ల రాములు కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.