తెలంగాణ కెరటం మద్దూరు ఏప్రిల్(28)
మర్మాముల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఇప్ప నిష్కాంత్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీని విడి జనగామ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో 250 మంది గ్రామస్థులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.అనతరం వారు మాట్లాడుతూ నేను మన గ్రామ అభివృద్ధికి కొరకే పార్టీ మారడం జరిగిందన్నారు గ్రామ ప్రజలకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు రాబోయే రోజులలో మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కొండల్ రెడ్డి,కొమురవేల్లి చైర్మన్ లక్ష్మారెడ్డి,సీనియర్ నాయకులు కామిడి జీవన్ రెడ్డి, సలాకపురం ఎంపీటీసీ ఇర్రి రాజేశ్వర్ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షుడు మ్యాక మల్లేశం,జనగామ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు శివరామరాజు, కొమురవేల్లి మండల అధ్యక్షులు శ్రీనివాస్,మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ కామిడి రమేష్ రెడ్డి,మండల బిసి సెల్ అధ్యక్షుడు సుందరగిరి సత్యనారాయణ,గ్రామ శాఖ అధ్యక్షులు భూపాల్ రెడ్డి,యూత్ నాయకులు చిగుళ్ల రాములు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..