Sunday , May 26 2024

ఉద్యోగం రాలేదనే బాధతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(18)

ఆర్మీ ఉద్యోగం రాదని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య మద్దూరు ఎస్సై షేక్ హుస్సేన్ మహమ్మద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం దూల్మీట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల రమేష్ ఆర్మీ సెలక్షన్ కొరకు గత నెలలో హన్మకొండలో ఉచిత శిబిరంకు వెళ్ళాడు అక్కడ మెడికల్ చెకప్ లో చేతులు వంకరగా ఉన్నాయని అతన్ని రిజెక్ట్ చేయడంతో ఆర్మీ ఉద్యోగం రాదని మనస్థాపానికి గురై 16 తారీఖు శనివారం రోజున కూటిగల్ గ్రామ శివారులో వారి వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగగా చికిత్స కొరకు ఆసుపత్రికి వెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం రోజున మరణించాడు.తండ్రి తిగుళ్ల బాలయ్య ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఒక ప్రకటనలో విలేకరులకు తెలియజేశారు.